Preganant Woman: గర్భిణులు టీకా వేయించుకునేందుకు కేంద్రం అనుమతి

Pregnant Women Can Get Vaccinated

  • గర్భిణులకు టీకా వేయాలన్న ఎన్‌టగి సిఫార్సులకు ఆమోదం
  • అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం
  • 18 ఏళ్లు నిండిన వారికి వర్తించే నిబంధనలన్నీ వర్తింపు

గర్భిణులు టీకా వేయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలను గర్భిణులు ఏ సమయంలోనైనా తీసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టగి) చేసిన సిఫార్సులను అంగీకరించినట్టు తెలిపింది. గర్భిణులకు టీకా అందించాలన్న సమాచారాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తెలియజేసింది. నిజానికి గర్భిణులకు వైరస్ సోకితే ప్రమాదకరంగా మారడంతోపాటు గర్భస్థ శిశువుకు కూడా ముప్పు ఉన్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ముఖ్యంగా నెలలు నిండకముందే కాన్పు కావడం వంటివి జరిగే అవకాశం ఉందని అధ్యయనాలు హెచ్చరించాయి.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిపుణుల బృందం చేసిన ప్రతిపాదనలను అంగీకరించింది. గర్భిణుల వ్యాక్సినేషన్‌కు సంబంధించిన మార్గదర్శకాలను కూడా సిద్ధం చేసింది. 18 ఏళ్లు నిండిన వారికి వర్తించే నిబంధనలన్నీ గర్భిణులకు కూడా వర్తిస్తాయని, సమీప వ్యాక్సిన్ సెంటర్లలో వారు టీకాలు వేయించుకోవచ్చని కేంద్రం తెలిపింది.

  • Loading...

More Telugu News