Hansika: ఉత్కంఠను రేపుతున్న 'మహా' టీజర్!

Maha movie teaser release

  • హన్సిక 50వ సినిమాగా 'మహా'
  • పోలీస్ ఆఫీసర్ గా శ్రీరామ్
  • కీలకమైన పాత్రలో శింబు
  • త్వరలోనే విడుదల        

హన్సిక ప్రధాన పాత్రధారిగా .. ఆమె 50వ సినిమాగా తమిళంలో 'మహా' సినిమా రూపొందింది. జమీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, చాలా రోజుల క్రితమే విడుదల కావలసింది. కానీ కొన్ని కారణాల వలన విడుదల విషయంలో ఆలస్యమైంది. కరోనా కారణం కూడా వాటికి తోడు కావడంతో మరింత ఆలస్యమవుతూ వచ్చింది. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా శివకార్తికేయన్ చేతుల మీదుగా ఒక టీజర్ ను రిలీజ్ చేయించారు.చిన్న పిల్లల వరుస హత్యల చుట్టూ ఈ కథ తిరుగుతుందనే విషయం టీజర్ ను బట్టి అర్థమవుతోంది. హన్సిక తన కంటిపాపలా చూసుకునే అమ్మాయిని కూడా ఆ సీరియల్ కిల్లర్ కిడ్నాప్ చేస్తాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? అనేదే కథ. హన్సిక ప్రేమికుడి పాత్రలో శింబు కనిపించే ఈ సినిమాలో, పోలీస్ ఆఫీసర్ గా శ్రీరామ్ నటించాడు. టీజర్ మాత్రం సినిమాపై ఆసక్తిని రేకెత్తించేదిలానే ఉంది. ఈ సినిమా రిలీజ్ కోసమే హన్సిక చాలా రోజులుగా ఎదురుచూస్తోంది. తెలుగులోను ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News