Ramcharan: పట్టాలెక్కనున్న రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్

Ram Charan and Dil Raju met director Shankar
  • నిన్న శంకర్ ను కలిసిన చరణ్, దిల్ రాజు
  • తమ కొత్త చిత్రం గురించి చర్చలు
  • సెప్టెంబరు లోపు సెట్స్ పైకి చిత్రం
  • ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న చరణ్
టాలీవుడ్ హీరో రామ్ చరణ్, సౌతిండియా సూపర్ డైరెక్టర్ శంకర్ ల కలయికలో వచ్చే పాన్ ఇండియా చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు నిన్న దర్శకుడు శంకర్ ను కలిసి ఫ్యూచర్ ప్రాజెక్టు గురించి చర్చించారు. మొత్తానికి తమ చిత్రాన్ని సెప్టెంబరు లోపే ప్రారంభించాలని దిల్ రాజు పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు శంకర్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.

ఇటీవల శంకర్ కు, లైకా ప్రొడక్షన్స్ సంస్థకు ఇండియన్-2 చిత్రానికి సంబంధించిన వివాదం నడిచింది. అయితే కోర్టులో శంకర్ కు అనుకూల ఉత్తర్వులు రావడంతో రామ్ చరణ్ తో చిత్రానికి మార్గం సుగమం అయింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో పూర్తి కానుంది. ఈ సినిమా తర్వాత శంకర్ తో సినిమాను పట్టాలెక్కించేందుకు రామ్ చరణ్ కూడా ఉత్సాహంగా ఉన్నాడు.

ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ పేరు వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుంది.
Ramcharan
Dil Raju
Shankar
Pan India Movie
Tollywood
Kollywood

More Telugu News