Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- కోల్ కతాలో కాజల్ షూటింగ్
- వచ్చే నెలలో 'ఆరడుగుల బుల్లెట్'
- 'మీట్ క్యూట్'లో ఆకాంక్ష సింగ్
* కథానాయిక కాజల్ అగర్వాల్ నటిస్తున్న హిందీ చిత్రం 'ఉమ' షూటింగ్ కోల్ కతాలో మొదలైంది. తథాగత సింఘ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కథానాయిక ప్రధాన చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రం షూటింగును సింగిల్ షెడ్యూల్ లో పూర్తిచేసేలా ప్లాన్ చేశారు.
* గోపీచంద్ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో కొన్నాళ్ల క్రితం రూపొందిన 'ఆరడుగుల బుల్లెట్' చిత్రం అన్ని అవాంతరాలను అధిగమించి వచ్చే నెలలో రిలీజ్ అవుతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత తాండ్ర రమేశ్ వెల్లడించారు. ఇందులో నయనతార కథానాయికగా నటించింది.
* నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వంలో రూపొందే 'మీట్ క్యూట్' చిత్రంలో ఒక హీరోయిన్ గా ఆకాంక్ష సింగ్ నటించనుంది. ఇందులో మొత్తం ఎనిమిది మంది హీరోయిన్లు నటిస్తారు.