Justice Easwar Prasad: జస్టిస్ జాస్తి ఈశ్వర్ ప్రసాద్ గుండెపోటుతో కన్నుమూత
- రేపు హైదరాబాదులో అంత్యక్రియలు
- గతంలో ఏపీ, కర్ణాటక హైకోర్టుల్లో సేవలు
- 1996లో కర్ణాటక హైకోర్టు జడ్జిగా పదవీవిరమణ
- పలు కీలక తీర్పులు వెలువరించిన ఈశ్వర్ ప్రసాద్
విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి ఈశ్వర్ ప్రసాద్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. రేపు ఉదయం హైదరాబాదు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన గతంలో ఏపీ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 1990-94 మధ్య కాలంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. 1996లో కర్ణాటక హైకోర్టు జడ్జిగా పదవీ విరమణ చేశారు. 1997లో భూకబ్జా నిరోధక చట్టం కోర్టు చైర్మన్ గా సేవలు అందించారు. జస్టిస్ జాస్తి ఈశ్వర్ ప్రసాద్ జాతీయ ట్రైబ్యునల్ చైర్మన్ గానూ వ్యవహరించారు.
న్యాయమూర్తిగా కొనసాగిన కాలంలో లౌకికవాదం, రాష్ట్రాల పాత్రపై కీలక తీర్పులు వెలువరించారు. సుమోటో కేసులతో హైదరాబాదులో భూకబ్జాలు నిరోధించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. సామాజిక స్పృహ మెండుగా ఉన్న జస్టిస్ జాస్తి ఈశ్వర్ ప్రసాద్ తన తల్లి సీతామహాలక్ష్మి పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవలు అందించారు.