Delta: డెల్టా కంటే లాంబ్డా మరింత ప్రమాదకరం

Lamda varient is more dangerous than Delta
  • ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వేరియంట్లు
  • పెరూలో నమోదైన కేసుల్లో 82 శాతం లాంబ్డా 
  • లాంబ్డా వేగంగా ప్రబలుతోందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన
కరోనా వైరస్ రోజురోజుకూ రూపాంతరాలు చెందుతోంది. కొత్తకొత్త వేరియంట్లు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ప్రస్తుతం డెల్టా, లాంబ్డా వేరియంట్లు ప్రమాదకరంగా మారాయి. అయితే డెల్టా కంటే లాంబ్డా వేరియంట్ మరింత ప్రమాదకరమని మలేసియా ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత నాలుగు వారాల్లో ఈ వేరియంట్ ను దాదాపు 30 దేశాల్లో గుర్తించారు. ప్రస్తుతం మరిన్ని దేశాలకు ఈ వేరియంట్ విస్తరిస్తోంది. ఈ వేరియంట్ కు లాటిన్ అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా దేశాలు భయపడుతున్నాయి.

కరోనా మరణాల రేటు ఎక్కువగా ఉన్న పెరూ దేశం నుంచి లాంబ్డా వైరస్ జాతి ఉద్భవించిందని మలేసియా ఆరోగ్యశాఖ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. యూకేలో గుర్తించిన లాంబ్డా వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే మూడు రెట్లు ప్రమాదకరమైనదని తెలిపింది. పెరూలో గత రెండు నెలల్లో వెలుగు చూసిన కరోనా నమూనాల్లో లాంబ్డా దాదాపు 82 శాతం ఉందని పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. లాంబ్డా వేరియంట్ వేగంగా ప్రబలుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. చిలీ దేశంలో 31 శాతం కేసుల్లో ఈ వేరియంట్ కనిపించింది.
Delta
Lamda
Corona Virus

More Telugu News