Nara Lokesh: అసెంబ్లీలో తీర్మానం, కేంద్రానికి రాసిన లేఖలు ఫేక్ అని తేలిపోయాయి: జగన్‌పై లోకేశ్ విమర్శలు
- విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని నాటకాలాడారు
- కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేసింది
- ఇప్పటికైనా జగన్నాటకాలు ఆపాలి
- ఢిల్లీ వెళ్లి ప్రైవేటీకరణని ఆపే ప్రయత్నాలు చేయండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. ప్రజలను మభ్యపెట్టడానికే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నట్లు జగన్ నాటకాలు ఆడుతున్నారని ఆయన చెప్పారు.
'ఫేక్ సీఎం వైఎస్ జగన్ గారూ! విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ మీరు చేసిన అసెంబ్లీలో తీర్మానం, కేంద్రానికి రాసిన లేఖలు ఫేక్ అని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో తేలిపోయింది' అని లోకేశ్ అన్నారు.
'ఇప్పటికైనా జగన్నాటకాలు ఆపి, ఢిల్లీ వెళ్లి ప్రైవేటీకరణని ఆపే ప్రయత్నాలు చేయండి. పదుల సంఖ్యలో ఉద్యమకారుల ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు' అని లోకేశ్ చెప్పారు.
'మీ ఎంపీల్ని మీ కేసుల మాఫీ లాబీయింగ్ కోసం కాకుండా, ఏపీ ప్రయోజనాల పరిరక్షణకి పోరాడాలని ఆదేశాలివ్వండి' అంటూ లోకేశ్ సూచించారు.