Venus: 12, 13 తేదీల్లో ఖగోళ అద్భుతం.. దగ్గరగా కనిపించనున్న శుక్రుడు, అంగారకుడు, చంద్రుడు
- భూమి, శుక్రుడు, చంద్రుడు, అంగారకుడు పరస్పరం సమీపంలోకి
- సాధారణ కంటితోనే వీక్షించే అవకాశం
- నిన్ననే ప్రారంభమైన ప్రక్రియ
ఈ నెల 12, 13 తేదీల్లో ఖగోళ అద్భుతం ఒకటి ప్రజలకు కనువిందు చేయనుంది. ఎలాంటి పరికరాల అవసరం లేకుండా సాధారణ కంటితోనే ఈ అద్భుతాన్ని వీక్షించొచ్చని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. ఈ నెల 13న శుక్రుడు, అంగారకుడు చాలా దగ్గరగా కనిపించనున్నారు. అంతకుముందు రోజు చంద్రుడు కూడా వాటికి దగ్గరగా చేరుకుంటాడు.
వాటి కక్ష్యల దృష్ట్యా అరుదైన సందర్భాల్లో ఆ గ్రహాలను భూమి నుంచి చూసినప్పుడు చాలా దగ్గరకు వచ్చినట్టు కనిపిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహాలు దగ్గరకు వచ్చినప్పుడు అంగారకుడు, శుక్రుడు మధ్య దూరం 0.5 డిగ్రీల మేర మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. కాగా, గ్రహాలు దగ్గరకు వచ్చే ప్రక్రియ నిన్ననే మొదలైందని, ఈ నెల 13న అవి మరింత దగ్గరగా కనిపిస్తాయని వివరించారు.