Delta Variant: మూడో డోసుతో ‘డెల్టా’కు అడ్డుకట్ట వేసే రోగనిరోధక వ్యవస్థ బలోపేతం: ఫైజర్

third dose needed to check delta variant

  • మూడో డోసుతో ఐదు నుంచి పది రెట్లు పెరిగిన యాంటీబాడీలు
  • రెండో టీకా తీసుకున్న 6 నుంచి 12 నెలలలోపు మూడో టీకా
  • అనుమతుల కోసం త్వరలోనే అమెరికా, యూరప్ దేశాలకు దరఖాస్తు

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌లోని ‘డెల్టా’ వేరియంట్‌కు మూడో డోసుతో అడ్డుకట్ట వేయొచ్చని ప్రముఖ ఔషధ సంస్థలు ఫైజర్, బయోఎన్‌టెక్ చెబుతున్నాయి. మూడో డోసుతో రోగ నిరోధక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, ఫలితంగా  డెల్టా వేరియంట్‌కు అడ్డుకట్ట పడుతుందని పేర్కొన్నాయి.

మూడో డోసు తీసుకున్న వారిలో యాంటీబాడీలు ఐదు నుంచి పది రెట్లు పెరిగినట్టు ఫైజర్, బయోఎన్‌టెక్ తెలిపాయి. ఫలితంగా వుహాన్, బీటా వేరియంట్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తున్నట్టు చెప్పాయి. డెల్టా వేరియంట్‌పైనా ఇవి సమర్థంగా పని చేసే అవకాశం ఉందని ఆ సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు.

 రెండో డోసు వేసిన ఆరు నుంచి 12 నెలల్లోపు మూడో డోసు అవసరం అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో మూడో డోసు కోసం త్వరలోనే అమెరికా, ఐరోపా దేశాల్లో అనుమతుల కోసం దరఖాస్తు చేస్తామన్నారు. కాగా, తొలుత భారత్‌లో గుర్తించిన డెల్టా వేరియంట్ జపాన్, థాయిలాండ్‌, అమెరికా, ఐరోపా దేశాలకు పాకి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వేరియంట్ కోసం ప్రత్యేకంగా ఓ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్నట్టు ఇప్పటికే పలు సంస్థలు ప్రకటించాయి.

  • Loading...

More Telugu News