Kamal Haasan: కమలహాసన్ కొత్త చిత్రం 'విక్రమ్' నుంచి ఫస్ట్ లుక్ విడుదల

First Look released from Kamal Haasan new movie Vikram
  • కమల్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో 'విక్రమ్'
  • మాస్టర్ తో హిట్ కొట్టిన కనగరాజ్
  • కమల్ తో కొత్త చిత్రంపై భారీ హైప్
  • పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా 'విక్రమ్'
నట దిగ్గజం కమలహాసన్ తాజా చిత్రం 'విక్రమ్' నుంచి ఇవాళ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ లో కమల్, విజయ్ సేతుపతి, ఫవాద్ ఫాజిల్ లను చూడొచ్చు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిస్తున్నారు. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ బ్యానర్ పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

లోకేశ్ కనగరాజ్ ఇటీవల విజయ్ హీరోగా వచ్చిన 'మాస్టర్' చిత్రంతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో, కమల్, లోకేశ్ కనగరాజ్ కాంబోపై భారీ హైప్ ఏర్పడింది. అయితే, ఈ సినిమా షూటింగ్ సెకండ్ వేవ్ సందర్భంగా నిలిచిపోయింది. ఇటీవలే పరిస్థితులు మెరుగవడంతో మళ్లీ సెట్స్ మీదకు వెళ్లింది. 'విక్రమ్' చిత్రంలో విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫవాద్ ఫాజిల్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
Kamal Haasan
Vikram
First Look
Lokesh Kanagaraj
Kollywood

More Telugu News