Corona Virus: దేశంలో నిన్న 38,792 కరోనా కేసులు నిర్ధారణ
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,09,46,074
- నిన్న 624 మంది మృతి
- మృతుల సంఖ్య మొత్తం 4,11,408
- మొత్తం 38,76,97,935 వ్యాక్సిన్ డోసులు
దేశంలో నిన్న 38,792 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే, 24 గంటల్లో 41,000 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,09,46,074కు చేరింది.
మరణాల విషయానికొస్తే... నిన్న 624 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,11,408కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,01,04,720 మంది కోలుకున్నారు. 4,29,946 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 38,76,97,935 వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న 37,14,441 డోసులు వేశారు.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 43,59,73,639 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,15,501 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.