Tirumala: శ్రీవారి హుండీలో పాకిస్థాన్ సహా 157 దేశాల కరెన్సీ నోట్లు

157 foreign countries currency in Tirumala hundi

  • అత్యధికంగా మలేషియా కరెన్సీ
  • తర్వాత స్థానంలో యూఎస్ నోట్లు
  • 2019-20లో రూ. 27.49 కోట్ల విదేశీ కరెన్సీ

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి హుండీలో ఇతర దేశాలకు చెందిన కరెన్సీ కూడా కనపడుతోంది. విదేశీ భక్తులు ఆయా దేశాల కరెన్సీని హుండీలో వేస్తున్నారు. ప్రపంచంలో 195 దేశాలు ఉండగా... శ్రీవారి హుండీలో 157 దేశాల కరెన్సీ వచ్చింది. విదేశీ కరెన్సీ విషయానికి వస్తే మలేషియా కరెన్సీ నోట్లు అత్యధికంగా 46 శాతం వచ్చాయి.

తర్వాతి స్థానంలో అమెరికా డాలర్లు ఉన్నాయి. అమెరికా డాలర్లు 16 శాతం వచ్చాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, స్వామి వారికి వచ్చిన విదేశీ కరెన్సీలో పాకిస్థాన్ నోట్లు కూడా ఉన్నాయి. 2019-20 సంవత్సరంలో విదేశీ కరెన్సీ రూపంలో శ్రీవారికి రూ. 27.49 కోట్ల ఆదాయం వచ్చింది. కరోనా కారణంగా ఈ ఏడాది విదేశీ నోట్లు తగ్గే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News