Punjab: రసవత్తరంగా పంజాబ్ రాజకీయాలు.. సిద్ధూకు పీసీసీ పగ్గాల వార్తలపై 'కెప్టెన్' అభ్యంతరం
- సిద్ధూ-అమరీందర్ సింగ్ మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు
- సిద్ధూకు పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చే యోచనలో అధిష్ఠానం
- అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో దెబ్బ పడుతుందన్న ‘కెప్టెన్’
నవజోత్‌సింగ్ సిద్ధూకు పీసీసీ పదవి ఇచ్చి ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో నెలకొన్న విభేదాలను పరిష్కరించాలని భావిస్తున్న కాంగ్రెస్ ప్రయత్నం ఫలించేలా కనిపించడం లేదు. సిద్ధూకు పీసీసీ పగ్గాల వార్తలపై స్పందించిన పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి లేఖ రాశారు.
పార్టీనే నమ్ముకుని ఉన్న వారిని, హిందూ, దళిత వర్గాలను కాదని సిద్ధూను కాంగ్రెస్ అధ్యక్షుడిని చేస్తే ఆ ప్రభావం రానున్న ఎన్నికల్లో పడుతుందని అందులో పేర్కొన్నారు. మరోవైపు, సిద్ధూ-అమరీందర్ మధ్య నెలకొన్న విభేదాలను తొలగించి, రాజీ కుదిర్చేందుకు కాంగ్రెస్ పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జ్ హరీశ్ రావత్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు సీఎం అమరీందర్ సింగ్‌తో చండీగఢ్‌లో భేటీ అవుతున్నారు.