B-Tech: బీటెక్ ఇక తెలుగులో చదివేయండి.. ప్రాంతీయ భాషల్లో బోధనకు ప్రభుత్వం అనుమతి

BTech now in regional languages

  • తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో బీటెక్ బోధనకు అనుమతి
  • వెల్లడించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
  • ప్రభుత్వ నిర్ణయంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం

బీటెక్ కోర్సులను ఇక ఎంచక్కా ప్రాంతీయ భాషల్లో చదివేయొచ్చు. తెలుగు సహా హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, గుజరాతీ, మలయాళం, బెంగాళీ, పంజాబీ, ఒడియా, అస్సామీ భాషల్లో బీటెక్ కోర్సుల బోధనకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతించినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న తెలిపారు.

ప్రాంతీయ భాషల్లో విద్యా విధానాన్ని ప్రోత్సహించేందుకు మోదీ కట్టుబడి ఉన్నారని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News