Devineni Uma: వీటిపై సమాధానం చెప్పండి వైఎస్ జగన్: దేవినేని ఉమ
- దిక్కుతోచని స్థితిలో సుబాబుల్ రైతులు
- కొనుగోలుచేసే వారు లేక పంట తీయలేక ఇబ్బందులు
- లక్షలాది టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా ప్రజలను ముంచారు
- సొంతింటికోసం మూడో ఏడాదికూడా ఎదురుచూపులే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. వైసీపీ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా ప్రజలను ముంచారని మండిపడ్డారు.
'కొనుగోలుచేసే వారు లేక పంట తీయలేక దిక్కుతోచని స్థితిలో సుబాబుల్ రైతులు ఉన్నారు. ఉచితంగా ఇస్తాం మొద్దులు తీసిపెట్టండంటున్నా ముందుకురాని వ్యాపారులు. కర్ర కన్నీరు పెట్టిస్తుంది. ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడూలేదు. టన్నుకు రూ5 వేలు ఇస్తామన్న మీ హామీ ఏమయ్యిందంటున్న రైతులకు సమాధానం చెప్పండి వైఎస్ జగన్' అని ఆయన నిలదీశారు.
'కేంద్రం ఇస్తున్న లక్షన్నర రాయితీ ఇళ్ల పైనే పూర్తిగా ఆధారపడిన ఏపీ సర్కార్. సొంతస్థలం ఉన్న వారికి మొండిచేయి చూపుతున్న ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు పూర్తి చేసిన లక్షలాది టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా ప్రజలను ముంచారు. సొంతింటికోసం మూడో ఏడాదికూడా ఎదురుచూపులే మిగిలాయంటున్న పేదలకు ఏం సమాధానం చెబుతారు? వైఎస్ జగన్' అని దేవినేని ఉమ ప్రశ్నించారు.