Vijayasai Reddy: హోదాపై నేనిచ్చిన నోటీసును ఈరోజు కూడా రాజ్యసభ ఛైర్మన్ తిరస్కరించారు: విజయసాయిరెడ్డి
- రూల్-267 కింద ప్రత్యేకహోదాపై చర్చించాలని నోటీసు ఇచ్చాను
- రెండో రోజు కూడా నా నోటీసును తిరస్కరించారు
- ప్లకార్డు పట్టుకుని పోడియం వద్ద నిరసన వ్యక్తం చేయాల్సి వచ్చింది
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీలు పార్లమెంటు వేదికగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో ప్రత్యేకహోదాపై చర్చను చేపట్టాలని కోరుతూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి విజయసాయిరెడ్డి నోటీసును ఇచ్చారు. రాజ్యసభలో నిర్వహించే ఇతర వ్యవహారాలన్నింటినీ పక్కన పెట్టి రూల్-267 కింద ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై చర్చను ప్రారంభించాలని నోటీసుల్లో కోరారు.
అయితే, కీలకమైన అంశాలు ఉండటంతో ఇప్పుడు దీనిపై చర్చ జరపలేమని వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ అంశంపై విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రత్యేకహోదాపై చర్చ జరపాలని కోరుతూ రాజ్యసభలో ఈరోజు (రెండో రోజు) కూడా నేనిచ్చిన నోటీసును ఛైర్మన్ తిరస్కరించడంతో... ప్లకార్డు పట్టుకుని పోడియం వద్ద నిరసన వ్యక్తం చేయాల్సి వచ్చిందని అన్నారు.