Ram Nath Kovind: బ‌క్రీద్ సంద‌ర్భంగా ప్ర‌ముఖుల‌ శుభాకాంక్ష‌లు

kovind modi bakrid wishes

  • ప్రేమ‌, త్యాగానికి ప్ర‌తీక బ‌క్రీద్ పండుగ: రాష్ట్రప‌తి
  • శాంతి, సహనం వృద్ధి చెందాలి: ఉప రాష్ట్రప‌తి
  • ఈ ప‌ర్వదినం భ‌క్తికి చిహ్నం: ప‌్ర‌ధాని

బక్రీద్ సంద‌ర్భంగా ముస్లింల‌కు రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు, ప్ర‌ధాని మోదీతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ‌, త్యాగానికి ప్ర‌తీకగా బ‌క్రీద్ పండుగ జ‌రుపుకుంటామ‌ని రాష్ట్ర‌ప‌తి కోవింద్ అన్నారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ బ‌క్రీద్ జ‌రుపుకోవాల‌ని సూచించారు.

'ప్రేమ, సహనం, త్యాగాలకు ప్రతీక అయిన బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. పేదలతో, బంధువులతో ఆహారాన్ని పంచుకునే ఈ పండుగ, మనకున్న దానిలో నలుగురికీ సాయం చేయాలనే సందేశాన్నిస్తుంది. ఈ సందర్భంగా శాంతి, సహనం వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను' అని ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు పేర్కొన్నారు.

ఈ ప‌ర్వ‌దినం భ‌క్తికి, విశ్వాసానికి సంకేత‌మ‌ని మోదీ అన్నారు. ఈ పండుగ సోద‌ర‌భావం, ఐక్య‌త‌కు ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని చెప్పారు.  

త్యాగానికి ప్రతీక బక్రీద్ అని, ఇస్లాం సంప్రదాయంలో ఈ పండుగకు ప్రత్యేక స్థానముందని తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ అన్నారు. క‌రోనా నేపథ్యంలో అందరూ నిబంధనలకు అనుగుణంగా పండుగను జరుపుకోవాలని సూచించారు.

ముస్లిం సోదరులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని అన్నారు. మహ్మద్ ప్రవక్త బోధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఇస్లాం సంప్రదాయంలో బక్రీద్ పండుగకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు.

విశ్వాసానికి, క‌రుణ‌, ఐక్య‌త‌కు ప్ర‌తీక బ‌క్రీద్‌. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ చేసుకునే బ‌క్రీద్ పండుగ సంద‌ర్భంగా ముస్లిం సోద‌ర సోద‌రీమ‌ణులంద‌రికీ శుభాకాంక్ష‌లు. అల్లాహ్ ఆశీస్సులు మనందరిపై ఎల్ల‌ప్పుడూ ఉండాల‌ని ప్రార్థిస్తున్నాను అని ఏపీ సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News