YS Vivekananda Reddy: వివేకా కేసు దర్యాప్తులో ప‌ర్య‌వేక్ష‌ణ అధికారి మార్పు

trail in viveka case

  • ఈ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు ప‌ర్య‌వేక్ష‌ణ అధికారిగా డీఐజీ సుధాసింగ్‌
  • ఎస్పీ రామ్‌కుమార్‌కు బదిలీ
  • 44 రోజులుగా కొనసాగిన ద‌ర్యాప్తు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ) కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో విచార‌ణ కొనసాగిస్తోన్న విష‌యం తెలిసిందే. కొన్ని రోజులుగా అక్క‌డే సీబీఐ అధికారులు అనుమానితుల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. ఈ కేసులో మ‌రిన్ని వివ‌రాల‌ను రాబ‌ట్టేందుకు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

అయితే, తాజాగా ఈ కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకుంది. పర్యవేక్షణ అధికారిని మార్చి వేస్తూ సీబీఐ నిర్ణ‌యం తీసుకుంది. ఈ కేసు డీఐజీ సుధాసింగ్‌ నుంచి ఎస్పీ రామ్‌కుమార్‌కు బదిలీ అయింది. ఈ కేసులో 44 రోజులుగా ద‌ర్యాప్తు కొనసాగింది. ఇప్పుడు పర్యవేక్షణ అధికారిని మార్చ‌డం చర్చనీయాంశం అవుతోంది.

  • Loading...

More Telugu News