Andhra Pradesh: హిజ్రాగా మారితే పెళ్లాడతానన్న మహిళ.. తీరా మారాక నిరాకరించడంతో పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
- ఏపీలోని కడపలో ఘటన
- కొన్నాళ్లు కలిసుండి, ముఖం చాటేసిన మహిళ
- కేసును ఎలా పరిష్కరించాలో తెలియక తలపట్టుకుంటున్న పోలీసులు
హిజ్రాగా మారితే పెళ్లాడతానన్న మహిళ మాటలు నమ్మిన ఓ యువతి మోసపోయింది. హిజ్రాగా మారాక సదరు మహిళ పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో జరిగిందీ ఘటన.
పోలీసుల కథనం ప్రకారం.. కారుణ్య నియామకాల్లో భాగంగా ఓ యువతికి ప్రభుత్వ ఉద్యోగం లభించింది. శిక్షణ సమయంలో ఓ మహిళ యువతికి పరిచయమైంది. అది ఇద్దరి మధ్య సాన్నిహిత్యానికి దారితీసింది. ఈ క్రమంలో హిజ్రాగా మారితే పెళ్లాడతానంటూ మహిళ చెప్పింది.
ఆమె మాటలు నమ్మిన యువతి హిజ్రాగా మారింది. కొంతకాలంగా కలిసి జీవిస్తున్నారు. తాజాగా యువతిని పెళ్లాడేందుకు ఆ మహిళ నిరాకరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హిజ్రాగా మారమని చెప్పి, మారిన తర్వాత తనను మోసం చేసిందంటూ బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును ఎలా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకున్నారు.