Daughter-in-law: పశ్చిమ గోదావరి జిల్లాలో అత్తగారి పుట్టినరోజు సందర్భంగా కోడలు ఏం చేసిందో చూడండి!
- అత్తాకోడళ్ల అనుబంధానికి నిదర్శనం
- అత్తగారి 60వ పుట్టినరోజు
- 60 రకాల వంటకాలు చేసిన కోడలు
- వీడియో వైరల్
అత్తాకోడళ్లు తల్లీకూతుళ్లలా కూడా ఉండొచ్చని అనేక సంఘటనల ద్వారా వెల్లడైంది. అలాంటి ఘటనే పశ్చిమ గోదావరి జిల్లాలోనూ వెలుగులోకి వచ్చింది. ఓ కోడలు తన అత్తగారి 60వ పుట్టినరోజును చిరస్మరణీయం చేయాలని భావించింది. అందుకే ఆమెను సంతోష పెట్టేలా ఏకంగా 60 రకాల వంటకాలను రూపొందించింది. అన్ని వంటకాలను ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచి వాటిపై పేర్లు రాసింది.
పులిహోర, కట్టుపొంగలి, బిర్యానీ, కొబ్బరి రైస్, ఫ్రైడ్ రైస్, పూరీలు, ఊతప్పం, ఆలూ పరాటా, చపాతీలు, సేమ్యా వెరైటీలు, గారెలు, వడలు, ఇడ్లీ వెరైటీలు, బజ్జీలు, పకోడీ రకాలు, ఓట్స్... ఇలా అనేక రకాల వంటలు చేసి అత్తగారిపై తన ప్రేమాభిమానాలను చాటుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.