Telangana: తెలంగాణలో సాధారణంగా రుతుపవన కదలికలు.. బీహార్ వైపు అల్పపీడనం!
- పశ్చిమ భారతదేశం నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణవైపు గాలులు
- నేడు, రేపు ఓ మాదిరి వర్షాలకు అవకాశం
- మరింత తీవ్రంగా మారిన అల్పపీడనం
తెలంగాణలో ఇటీవల చురుగ్గా కదలి విస్తారంగా వర్షాలు కురిపించిన నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం సాధారణంగా ఉన్నాయి. పశ్చిమ భారతదేశం నుంచి తెలంగాణవైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడ ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. గాలిలో తేమ సాధారణం కంటే 15 శాతం వరకు తగ్గడంతో వాతావరణం పొడిగా ఉన్నట్టు పేర్కొంది. మరోవైపు, బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రంగా మారి పశ్చిమ బెంగాల్‌పై ఆవరించి ఉంది. నేడు, రేపు ఇది బీహార్, ఝార్ఖండ్ వైపుగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.