Kanakamedala Ravindra Kumar: ఏపీ శాసనమండలి రద్దు అంశంపై రాజ్యసభలో ప్రశ్నించిన టీడీపీ సభ్యుడు కనకమేడల

TDP MP Kanakamedala Ravindra Kumar questions on legislative Council abolition

  • మండలి రద్దుపై తీర్మానం చేసిన ఏపీ శాసనసభ 
  • మండలి రద్దుపై కేంద్రానికి సిఫార్సు 
  • లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చిన మంత్రి 
  • మండలి రద్దు కేంద్రం పరిశీలనలో ఉందని వెల్లడి

ఏపీ శాసనమండలి రద్దు అంశాన్ని టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఇవాళ రాజ్యసభలో లేవనెత్తారు. ఆయన ప్రశ్నకు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. శాసనమండలిని రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిందని కిరణ్ రిజిజు చెబుతూ, మండలి రద్దు అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు.

గతంలో ఏపీకి మూడు రాజధానుల అంశం అసెంబ్లీలో ఆమోదం పొందినా, మండలిలో విముఖత ఎదుర్కొంది. అప్పటికి మండలిలో టీడీపీ బలమే ఎక్కువగా ఉంది. దాంతో పలు బిల్లులు అసెంబ్లీ ఆమోదానికి నోచుకున్నా, మండలి వద్దకు వచ్చేటప్పటికి వాటికి అడ్డంకులు ఎదురయ్యేవి. ఈ నేపథ్యంలో, మండలిని రద్దు చేయాలంటూ జగన్ సర్కారు తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే ఇటీవల కొత్త ఎమ్మెల్సీలు రావడంతో మండలిలో వైసీపీ బలం పెరిగింది. మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.

  • Loading...

More Telugu News