Cinema Theaters: ఏపీలో ఈ నెల 31న సినిమా థియేటర్ల పునఃప్రారంభం
- ఏపీ థియేటర్లలో మళ్లీ సినిమా కళ
- పునఃప్రారంభానికి ప్రభుత్వం అనుమతి
- 50 శాతం సీటింగ్ తో ప్రదర్శనలు
- కరోనా మార్గదర్శకాలు తప్పనిసరి
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతితో మూతపడిన సినిమా హాళ్లు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఈ నెల 31 నుంచి సినిమా థియేటర్లలో ప్రదర్శనలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, 50 శాతం సీటింగ్ తోనే ప్రదర్శనలు జరుపుకోవాలని స్పష్టం చేసింది. మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం వంటి కరోనా మార్గదర్శకాలు పాటించడం తప్పనిసరి అని పేర్కొంది.
ఇటీవల కర్ఫ్యూ సమయాల సడలింపులు ఇచ్చే సందర్భంలోనే థియేటర్ల రీ ఓపెనింగ్ కు సర్కారు పచ్చజెండా ఊపింది. అయితే, నిర్మాతలతో ఎగ్జిబిటర్ల వివాదం ఓ కొలిక్కిరాకపోవడంతో థియేటర్లు తెరుచుకోవడం ఆలస్యమైంది. కాగా, 50 శాతం సీటింగ్ తో సినిమా ప్రదర్శనలు తమకు లాభదాయకం కాదని థియేటర్ల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.