Etela Rajender: అపోలో ఆసుపత్రికి ఈటల రాజేందర్ తరలింపు.. పలువురు నేతల పరామర్శ
- పాదయాత్రలో పాల్గొంటూ అస్వస్థతకు గురైన ఈటల
- మొదట నిమ్స్‌లో చికిత్స
- అపోలోకు వచ్చి పరామర్శించిన బండి సంజయ్, వివేక్
తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో పాదయాత్రలో పాల్గొంటూ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయన మొదట హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆయనను జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
అపోలోకు వచ్చిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ నేత వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్.. ఈటలను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం కుదుటపడ్డాక.. తన పాదయాత్ర వాయిదాపడ్డ గ్రామం నుంచే ఈటల తిరిగి ప్రజా దీవెన యాత్రను ప్రారంభిస్తారని బీజేపీ నాయకులు తెలిపారు. మరోపక్క హుజూరాబాద్‌లో ఇతర బీజేపీ నేతలు చేస్తోన్న ప్రచారం మాత్రం కొనసాగుతోందని చెప్పారు.