Devineni Uma: దేవినేని ఉమ పిటిషన్ పై హైకోర్టులో ముగిసిన వాదనలు... తీర్పు రేపటికి రిజర్వ్
- కొండపల్లి అటవీ ప్రాంతంలోకి వెళ్లిన సందర్భంగా ఉద్రిక్తత
- ఉమపై పలు సెక్షన్ల కింద కేసుల నమోదు
- హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన ఉమ
టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఈరోజు వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రేపటికి రిజర్వ్ చేసింది. కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే సమాచారంతో పరిశీలన కోసం ఉమ అక్కడకు వెళ్లారు.
ఈ క్రమంలో జి.కొండూరు ప్రాంతంలో అలజడి చెలరేగింది. దీనికి దేవినేని ఉమ కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. కుట్ర, హత్యయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. గత బుధవారం కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఉమ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులకు ఎలాంటి ఆధారాలు లేవని... అందువల్ల బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. మరోవైపు దేవినేని ఇంటికి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుటుంబసభ్యులను పరామర్శించిన సంగతి తెలిసిందే.