Sensex: స్టాక్ మార్కెట్: వరుసగా మూడో రోజూ లాభాలే!
- మొదట్లో ఒడిదుడుకులకు లోనైన సూచీలు
- హెవీ వెయిట్ కంపెనీల అండతో లాభాల బాట
- 123.07 పాయింట్ల లాభంతో సెన్సెక్స్
- 35.80 పాయింట్ల లాభంతో నిఫ్టీ
వరుసగా మూడో రోజు నేడు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలలో ముగిశాయి. మొదట్లో సూచీలు కొంత ఒడిదుడుకులకు లోనైనా ఆ తర్వాత పుంజుకుని లాభాల్లో కొనసాగాయి. రిలయన్స్, ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్ వంటి హెవీ వెయిట్ కంపెనీల అండతో మార్కెట్లు లాభాలు పొందాయి.
దీంతో సెన్సెక్స్ 123.07 పాయింట్ల లాభంతో 54492.84 వద్ద.. నిఫ్టీ 35.80 పాయింట్ల లాభంతో 16294.60 వద్ద ముగిశాయి. ఇక నేటి సెషన్లో భారతీ ఎయిర్ టెల్, ఐషర్ మోటార్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్&టీ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా, నెస్లే తదితర కంపెనీల షేర్లు లాభాలు పొందాయి. కాగా, ఎస్బీఐ, పీవీఆర్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీలు నష్టపోయాయి.