Revanth Reddy: ఇంద్రవెల్లి కాంగ్రెస్ సభకు భారీగా తరలివెళుతున్న ప్రజలు.. వీడియో ఇదిగో
- ఈ రోజు మధ్యాహ్నం సభ ప్రారంభం
- ముఖ్య అతిథిగా హాజరుకానున్న రేవంత్ రెడ్డి
- లక్ష మందితో దళిత గిరిజన దండోరా సభ
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభకు ప్రజలు భారీగా తరలివెళుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ బహిరంగ సభకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గాంధీ భవన్ నుంచి ఇంద్రవెల్లికి ఆయన ర్యాలీగా బయలుదేరారు. ముందు ఆయన గుడిహత్నూర్ చేరుకుని యూత్ కాంగ్రెస్ నిర్వహించే జెండా కార్యక్రమంలో పాల్గొని, ఆ తర్వాత ఇంద్రవెల్లి చేరుకుని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు.
అనంతరం బహిరంగ సభకు చేరుకుని ప్రసంగిస్తారు. సుమారు 18 ఎకరాల స్థలంలో లక్ష మంది వచ్చేలా బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇంద్రవెల్లి సభ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకానికి కౌంటర్‌గా ఈ సభను నిర్వహిస్తున్నారు. కేసీఆర్ పాలనలో దళిత, గిరిజన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని, మోసాన్ని ఎండగట్టి ప్రజల్లో చైతన్యం నింపుతామని కాంగ్రెస్ ప్రకటించింది.