Afghanistan: అదంతా ఓ విష ప్రచారం: తాలిబన్ల ప్రకటన

Talibans Clarified Over Allegations On Women To Marry Talibans

  • అమ్మాయిలపై మేం ఆగడాలకు పాల్పడలేదు
  • వారిని పెళ్లి చేసుకోవాలని బలవంతమూ చేయలేదు
  • ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వానివి తప్పుడు ఆరోపణలు

ఆడపిల్లలపై తాము అరాచకాలకు పాల్పడుతున్నామన్న వ్యాఖ్యల్లో నిజం లేదని, తాలిబన్ ఫైటర్లను పెళ్లి చేసుకోవాలన్న ఆదేశాలను తాము ఇవ్వలేదని తాలిబన్లు ప్రకటించారు. ఇవాళ తాలిబన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ ఈ విషయాన్ని చెప్పాడు. తమపై విష ప్రచారం చేస్తున్నారని అన్నాడు. ముజాహిదీన్లను పెళ్లి చేసుకోవాలంటూ అమ్మాయిలపై తాలిబన్లు ఆగడాలకు పాల్పడుతున్నారన్న ఆఫ్ఘనిస్థాన్ సైన్యం మాటల్లో నిజం లేదని చెప్పాడు.

తమపై ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం లేనిపోని అభాండాలు వేస్తూ.. తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డాడు. ప్రజలను ముజాహిదీన్లు చంపేస్తున్నారని, చెరబడుతున్నారంటూ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నాడు.

కాగా, ఇవాళ ఉదయం ఆఫ్ఘనిస్థాన్ లో కీలకనగరమైన జలాలాబాద్ ను తాలిబన్ ఉగ్రవాదులు ఆక్రమించుకున్నారు. నిన్న మజారీ షరీఫ్ నూ చేజిక్కుంచుకున్నారు. ఎలాంటి తిరుగుబాట్లు లేకుండానే తాలిబన్లు జలాలాబాద్ లోకి ప్రవేశించారని, ఎక్కడ చూసినా తెలుపు జెండాలే కనిపిస్తున్నాయని ఓ స్థానికుడు చెప్పారు. కాగా, తాజాగా తాలిబన్లు కాబూల్ కు మరింత చేరువయ్యారు. ఏ క్షణమైనా దేశ రాజధాని వారి చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదముంది.

  • Loading...

More Telugu News