Sensex: కొత్త రికార్డు స్థాయుల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in new highs

  • 145 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 34 పాయింట్లు లాభపడిన నిఫ్టీ
  • 3.67 శాతం పెరిగిన టాటా స్టీల్ షేర్ వాల్యూ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 243 పాయింట్లు లాభపడి రికార్డు స్థాయిలో 55,680కి చేరుకుంది. అయితే ఆ తర్వాత ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మారుతి సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో లాభాలు కొంతమేర తగ్గాయి. చివరకు ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 145 పాయింట్లు లాభపడి 55,582కి చేరుకుంది. నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 16,563 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (3.67%), బజాజ్ ఫైనాన్స్ (3.48%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.60%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.33%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.88%).
 
టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-2.49%), బజాజ్ ఆటో (-2.08%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.00%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.53%), భారతి ఎయిర్ టెల్ (-0.64%).

  • Loading...

More Telugu News