Asaduddin Owaisi: ఆఫ్ఘనిస్థాన్ విషయంలో ఏం చేయబోతున్నారు?: కేంద్రాన్ని ప్రశ్నించిన అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin Owaisi questioned modi on afghanistan taliban issue

  • ఆఫ్ఘనిస్థాన్ విషయంలో ఎప్పుడో స్పందించాల్సింది
  • మూడు మిలియన్ డాలర్లు ఖర్చు చేసి నిర్మించిన పార్లమెంట్, జలాశయం వృథా
  • ఉగ్రవాద సంస్థలు అక్కడే ఉన్నా భారత ప్రభుత్వం అంత ప్రాధాన్యం ఎందుకిచ్చింది?

ఆఫ్ఘనిస్థాన్‌లోని ప్రస్తుత పరిస్థితులపై భారత ప్రభుత్వం అవలంబించబోయే వైఖరిని వెల్లడించాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌లో భారత ప్రభుత్వం మూడు మిలియన్ డాలర్లు ఖర్చు చేసి పార్లమెంట్, జలాశయం నిర్మించిందని గుర్తు చేసిన ఒవైసీ.. ఇప్పుడు ఆ అభివృద్ధి అంతా వృథా అయిందన్నారు.

ఆఫ్ఘన్ విషయంలో భారత ప్రభుత్వం గతంలోనే స్పందించాల్సిందన్నారు. అల్‌ఖైదా, ఐసిస్ హెడ్‌క్వార్టర్లను ఆఫ్ఘనిస్థాన్‌కు మార్చారని, ఈ విషయంలో మోదీ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. తాలిబన్లు, జైషే మహ్మద్, అల్‌ఖైదా గురించి భారత ప్రభుత్వానికి తెలిసినప్పటికీ ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంకు భారత ప్రభుత్వం ఎందుకు అంత ప్రాధాన్యం ఇచ్చిందో మోదీ చెప్పాలన్నారు.

  • Loading...

More Telugu News