Russia: తాలిబన్లతో నేడు భేటీ కానున్న రష్యా రాయబారి.. కీలక ప్రకటన వెలువడే అవకాశం
- ఆఫ్ఘన్ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న రష్యా
- ఆఫ్ఘన్ కు మరోసారి సహకారం అందించే దిశగా అడుగులు
- 1979 ప్రాంతంలో ఆఫ్ఘనిస్థాన్ కు అండగా ఉన్న రష్యా
ఆప్ఘనిస్థాన్ లో అత్యంత వేగంగా మారుతున్న పరిణామాలను రష్యా నిశితంగా పరిశీలిస్తోంది. ఈరోజు తాలిబన్ నేతలతో రష్యా రాయబారి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తాలిబన్లు ఏర్పాటు చేసే ప్రభుత్వానికి అండగా ఉంటామని ఈ సమావేశంలో ఆయన స్పష్టం చేసే అవకాశం ఉందని చెపుతున్నారు. ఈ చర్చలు ఫలిస్తే ఆఫ్ఘనిస్థాన్ లోకి రష్యా మరోసారి ప్రవేశించే అవకాశం ఉంది.
వాస్తవానికి గతంలో కూడా ఆఫ్ఘన్లకు రష్యా సహకారం అందించింది. 1979 ప్రాంతంలో ఆఫ్ఘన్ కు రష్యా అండగా ఉంది. ఆ ప్రాంతాన్ని అప్పటి సోవియట్ యూనియన్ స్వాధీనంలోకి తీసుకుంది. అయితే ఆ తర్వాత సోవియట్ యూనియన్ పతనం కావడంతో రష్యన్ బలగాలు వెనక్కి మళ్లాయి. ఇప్పుడు మరోసారి ఆఫ్ఘన్ కు సహకారం అందించేందుకు రష్యా ముందుకు వస్తున్నట్టు సమాచారం. మరోవైపు తాలిబన్లకు సహకరిస్తామని ఇప్పటికే చైనా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాలిబన్లతో రష్యా రాయబారి భేటీ అనంతరం కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.