Andhra Pradesh: కడపలో సీబీఐ అధికారులను కలిసిన వివేకా కుమార్తె

Vivekananda Reddy Daughter Sunita Meets CBI Officials

  • హత్య కేసు విచారణపై ఆరా
  • ఎంపీ అవినాశ్ తండ్రి, బాబాయిలను విచారించిన సీబీఐ
  • సునీల్ యాదవ్ బంధువు కూడా హాజరు
  • మరికొందరిని విచారిస్తున్న అధికారులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఈ రోజు కడపలో సీబీఐ అధికారులను కలిశారు. తన తండ్రి హత్య కేసు విచారణలో పురోగతిని ఆమె అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. మరోపక్క, అనుమానితులను కడపలో అధికారులు విచారిస్తున్నారు. పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఆయన బాబాయి మనోహర్ రెడ్డి, వివేకానందరెడ్డి అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిలను విచారణకు పిలిపించారు. ఈ నేపథ్యంలోనే హత్యకు సంబంధించిన వివరాలేమైనా వెల్లడయ్యాయో లేదో తెలుసుకునేందుకు ఆమె సీబీఐ అధికారులను కలిసినట్టు తెలుస్తోంది.

ఇటు 73వ రోజు విచారణ సందర్భంగా కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో సునీల్ యాదవ్ బంధువు భరత్ యాదవ్ ను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వివేకా పొలం పనులను చూసిన సుంకేసుల గ్రామానికి చెందిన జగదీశ్వర్ రెడ్డితో పాటు ఓ పోలీస్ కానిస్టేబుల్ నూ విచారణకు పిలిచారు. పులివెందులకు చెందిన మహబూబ్ బాషా, నాగేంద్ర అనే వ్యక్తితో పాటు హత్యలో అనుమానితుడిగా ఉన్న మరో వ్యక్తి కూడా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News