Sensex: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. 8 శాతానికి పైగా నష్టపోయిన టాటా స్టీల్ షేర్
- 300 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 118 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- 5.37 శాతం లాభపడ్డ హిందుస్థాన్ యూనిలీవర్ షేర్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాల్లో ముగించాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు నష్టాల్లోనే కొనసాగాయి. ఈరోజు ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. దీని ప్రభావం మన మార్కెట్లపై కూడా పడింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 300 పాయింట్లు నష్టపోయి 55,329కి పడిపోయింది. నిఫ్టీ 118 పాయింట్లు కోల్పోయి 16,450 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (5.37%), ఏసియన్ పెయింట్స్ (3.64%), నెస్లే ఇండియా (3.40%), బజాజ్ ఫైనాన్స్ (1.71%), హెచ్డీఎఫ్సీ (0.43%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-8.27%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.07%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-2.81%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-2.68%), ఎల్ అండ్ టీ (-2.34%).