Amaravati: కరోనా నేపథ్యంలో.. అమరావతి పిటిషన్లపై విచారణను వాయిదా వేసిన హైకోర్టు

AP HC adjourns hearing of Amaravati cases

  • నవంబర్ 15కి వాయిదా వేసిన హైకోర్టు
  • విచారణను వాయిదా వేయాలని పిటిషనర్లు, న్యాయవాదుల విన్నపం
  • నిర్ణయాన్ని కోర్టుకు వదిలేసిన ప్రభుత్వం తరపు అడ్వకేట్లు 

ఏపీ రాజధాని అమరావతి పిటిషన్లపై హైకోర్టు విచారణ వాయిదా పడింది. కరోనా కేసుల నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలని పిటిషనర్లు, వారి తరపు లాయర్లు కోరడంతో న్యాయస్థానం విచారణను నవంబరు 15కి వాయిదా వేసింది. ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాదులు కూడా నిర్ణయాన్ని కోర్టుకు వదిలేశారు. దీంతో చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ వాయిదా వేసింది.

సీఆర్డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ నిర్ణయాలను సవాల్ చేస్తూ హైకోర్టులో ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఏడాది మార్చి 26న పిటిషన్లపై హైకోర్టు తొలుత విచారణ జరిపింది. ఆ రోజున తదుపరి విచారణను మే 3కు వాయిదా వేసింది. మే 3న పిటిషన్లు విచారణకు రాగా.. కరోనా కారణంగా విచారణను వాయిదా వేయాలని అడ్వకేట్లు కోరారు. దీంతో, ఈరోజుకు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. తాజాగా మరోసారి విచారణ వాయిదా పడింది.

  • Loading...

More Telugu News