TS High Court: సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసిన తెలంగాణ హైకోర్టు.. జైలు శిక్ష నుంచి ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు ఊరట

Telangana High Court  struck down  single judges verdict on contempt of court

  • కోర్టు ధిక్కరణ కేసులో ఆరు నెలల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా
  • సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై హైకోర్టుకు
  • 2009 నాటి స్టే ఉత్తర్వులపై ఇప్పుడు ధిక్కరణ పిటిషన్ ఏంటని ప్రశ్న
  • కాలపరిమితి ముగియడంతో సింగిల్ జడ్జ్ తీర్పును కొట్టేసిన ధర్మాసనం

కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు ఐఎస్ఎస్, ఇద్దరు ఐఎఫ్ఎస్ సహా ఆరుగురు అధికారులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వీరిలో అటవీ సంరక్షణశాఖ ప్రధానాధికారి ఆర్.శోభ, రంగారెడ్డి జిల్లా సీసీఎఫ్ సునీత, ఎం. భగవత్, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతకుమారి, రంగారెడ్డి కలెక్టర్ డి.అమోయ్‌కుమార్, అదనపు కలెక్టర్, ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారి ఎస్.తిరుపతిరావు, రంగారెడ్డి  జిల్లా అటవీ అధికారి జానకీంరామ్‌ ఉన్నారు.

 ఓ కేసు విచారణలో కోర్టు ధిక్కరణ కింద ఆరు నెలల జైలు శిక్ష, రూ. 2 వేల చొప్పున జరిమానా విధిస్తూ జులైలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై వీరు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం.. 2009లో ఇచ్చిన స్టే ఉత్తర్వులపై 2015లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడాన్ని తప్పుబట్టింది. కాలపరిమితి ముగియడంతో కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోలేమంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.

  • Loading...

More Telugu News