Sensex: వరుసగా రెండో రోజు ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు
- 5 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 2 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- నాలుగున్నర శాతం వరకు నష్టపోయిన ఎయిర్ టెల్ షేర్ వాల్యూ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగి చివరకు ఫ్లాట్ గా ముగిశాయి. మార్కెట్లు ఫ్లాట్ గా ముగియడం వరుసగా ఇది రెండో రోజు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 5 పాయింట్ల లాభంతో 55,949 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 2 పాయింట్లు పెరిగి 16,637కు చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.28%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.26%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.16%), యాక్సిస్ బ్యాంక్ (0.97%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.96%).
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-4.48%), మారుతి సుజుకి (-1.52%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.42%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.25%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.91%).