Botsa Satyanarayana: రెండేళ్లుగా చేసిన అప్పులను నేరుగా ప్రజల ఖాతాల్లోకే బదిలీ చేశాం: బొత్స

Deposited total amount into peoples account says Botsa Satyanarayana

  • విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ చేస్తాం
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను జగన్ కూడా వ్యతిరేకిస్తున్నారు
  • పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై వైసీపీ కూడా నిరసన వ్యక్తం చేస్తోంది

విశాఖను రాజధాని చేయడం ఖాయమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కేవలం 20 గ్రామాల కోసమే రాజధాని ఉండాలా? అని ప్రశ్నించారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖను ప్రకటిస్తే ప్రతిపక్ష పార్టీలు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నాయని విమర్శించారు. విశాఖ కేపిటల్ ను వ్యతిరేకించిన వారెవరికీ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ముఖ్యమంత్రి జగన్ వ్యతిరేకిస్తున్నారని బొత్స తెలిపారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో కూడా తీర్మానం చేస్తామని చెప్పారు. గతంలో మోదీ కేబినెట్ లో ఉన్న అశోక్ గజపతిరాజుకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి తెలియదా? అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై వైసీపీ కూడా నిరసన వ్యక్తం చేస్తోందని అన్నారు. గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి, వాటిని నేరుగా ప్రజల ఖాతాల్లోకే బదిలీ చేసిందని మంత్రి బొత్స చెప్పారు.

  • Loading...

More Telugu News