kabul: కాబూల్ విమానాశ్రయం వద్ద మరోసారి కలకలం.. రాకెట్ దాడి
- ఈ రోజు ఉదయం 6.40 గంటలకు దాడి
- ఓ వాహనం నుంచి రాకెట్లను ప్రయోగించిన ఉగ్రవాదులు?
- పొగతో నిండిపోయిన పరిసరాలు
ఆఫ్ఘనిస్థాన్ పౌరులతో పాటు ఇతర దేశాల ప్రజలు రాజధాని కాబుల్ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు జరుపుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతుండడం కలకలం రేపుతోంది. ఇటీవల జరిగిన భారీ ఉగ్రదాడిని మరవక ముందే ఈ రోజు ఉదయం 6.40 గంటలకు మరోసారి రాకెట్ దాడి జరిగింది.
ఉగ్రవాదులు ఓ వాహనం నుంచి రాకెట్లను ప్రయోగించి దాడి చేసినట్లు అక్కడ మీడియా పేర్కొంది. దాడి వల్ల అక్కడ పరిసరాలు పొగతో నిండిపోయాయి. కాబుల్ ఎయిర్‌పోర్టు సమీపంలోని యూనివర్సిటీ నుంచి ఈ రాకెట్లను ప్రయోగించారు. కాబూల్ లో ఉగ్రదాడి జరగవచ్చని అమెరికా నిన్న కూడా హెచ్చరించింది. తాజా ఉగ్రదాడిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.