Mithun Reddy: చంద్రబాబు పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదవాలా? ఇతరుల పిల్లలు చదువుకోకూడదా?: మిథున్ రెడ్డి

Chandrababu is talking only to criticise  Jagan says Mithun Reddy
  • ఇంగ్లీష్ మీడియంపై విమర్శలు చేయడం దారుణం
  • లోకేశ్ కుమారుడు ఏ మీడియంలో చదువుతున్నాడు? 
  • తెలుగులోనే చదివితే ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఎలా వస్తాయి?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియంపై చంద్రబాబు విమర్శలు చేయడం దారుణమని అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని అన్నారు. చంద్రబాబు కొడుకు నారా లోకేశ్ ఏ మీడియంలో చదువుకున్నారని మిథున్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు లోకేశ్ కుమారుడు ఏ మీడియంలో చదువుతున్నాడని అడిగారు.

అసలు చంద్రబాబు పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదవాలా? ఇతరుల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదా? అని ప్రశ్నించారు. కేవలం తెలుగులోనే చదివితే ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఎలా వస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించడానికే చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. చదువుకు జగన్ అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని అన్నారు.
Mithun Reddy
YSRCP
Jagan
Chandrababu
Nara Lokesh

More Telugu News