AP High Court: పలు జిల్లాల్లో కరోనా కేసుల పెరుగుదలపై ఆరా తీసిన ఏపీ హైకోర్టు

AP High Court asks corona cases details

  • ఏపీలో కరోనా పరిస్థితులపై వ్యాజ్యం
  • విచారణ చేపట్టిన హైకోర్టు
  • అఫిడవిట్లు దాఖలు చేసిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు
  • అధికారులకు దిశానిర్దేశం చేసిన ధర్మాసనం

ఏపీలో కరోనా చికిత్స, ఇతర అంశాలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాల్లో కొత్త కేసులు పెరుగుతుండడం పట్ల హైకోర్టు ఆరా తీసింది. టీచర్లు, న్యాయవాదులకు వ్యాక్సినేషన్ పై అధికారులను వివరాలు కోరింది. వ్యాక్సినేషన్ ఎప్పుడు పూర్తవుతుందని ప్రశ్నించింది. సెప్టెంబరు 8 నాటికి స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ఆదేశించింది. జనం గుమికూడే ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అధిక కేసులు వస్తున్న జిల్లాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్దేశించింది.

45 ఏళ్లు నిండిన వారిలో 90 శాతం మందికి టీకాలు వేశామని ప్రభుత్వాధికారులు కోర్టుకు తెలిపారు. మిగిలిన వాళ్లకు వ్యాక్సినేషన్ జరుగుతోందని తమ అఫిడవిట్లో వివరించారు. అటు, ఈ విచారణకు హాజరైన కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, 28 ఆక్సిజన్ ప్లాంట్లకు గాను 18 ప్లాంట్ల ఏర్పాటు పూర్తయిందని తన అఫిడవిట్లో వెల్లడించింది.

  • Loading...

More Telugu News