YS Jagan: కడప జిల్లాలో సీఎం జగన్ రెండ్రోజుల పర్యటన... షెడ్యూల్ ఖరారు
- సెప్టెంబరు 2న వైఎస్సార్ వర్ధంతి
- రేపు మధ్యాహ్నం కడప పయనం
- నివాళులు అర్పించనున్న సీఎం
- ఎల్లుండి తాడేపల్లి తిరిగి రాక
సెప్టెంబరు 2న వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ రెండ్రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి కడప పయనమవుతారు. సాయంత్రం 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకుని పార్టీ నాయకులతో మాట్లాడతారు. అనంతరం అక్కడి వైఎస్సార్ ఎస్టేట్ లో ఉన్న అతిథిగృహంలో బస చేస్తారు.
ఇక, ఎల్లుండి ఉదయం 9.30 గంటలకు రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడ ఏర్పాటు చేసే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పార్టీ నాయకులతో మాట్లాడి తాడేపల్లి తిరుగు పయనమవుతారు. కాగా, ఇటీవల హిమాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్ కుటుంబం నేడు రాష్ట్రానికి తిరిగివచ్చింది.