Sensex: స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల లాభాలకు బ్రేక్
- 214 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 55 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 3 శాతం వరకు నష్టపోయిన ఎం అండ్ ఎం షేర్ వాల్యూ
దేశీయ స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 214 పాయింట్లు నష్టపోయి 57,338కి పడిపోయింది. నిఫ్టీ 55 పాయింట్లు కోల్పోయి 17,076 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (3.20%), నెస్లే ఇండియా (1.73%), యాక్సిస్ బ్యాంక్ (1.54%), టైటాన్ కంపెనీ (1.24%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.17%).
టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-2.89%), టాటా స్టీల్ (-2.67%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.04%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.93%), టీసీఎస్ (-1.91%).