Asaduddin Owaisi: వైఎస్ అంటే అభిమానమే.. కానీ రాలేను: అసదుద్దీన్ ఒవైసీ

Owaisi rejected YS Vijayammas invitation

  • వైఎస్ సంస్మరణ సభకు 300 మందికి ఆహ్వానాలు
  • ఆహ్వానాలు వెళ్లిన వారిలో చిరంజీవి, గద్దర్
  • విజయమ్మ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించిన ఒవైసీ

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సంస్మరణ సభను హైదరాబాదులో రేపు సాయంకాలం నిర్వహించనున్నారు. ఈ సభ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఈ సభకు రావాలని ఆహ్వానిస్తూ 300 మందికి వైఎస్ భార్య విజయమ్మ ఆహ్వానాలు పంపారు.

ఇందులో భాగంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి కూడా ఆహ్వానం పంపారు. అయితే, విజయమ్మ ఆహ్వానాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. వైఎస్ అంటే తనకు అభిమానం ఉందని... అయితే, సభకు మాత్రం రాలేనని ఆయన సందేశం పంపినట్టు చెపుతున్నారు.

ఇక సభకు రాజకీయ నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా విజయమ్మ ఆహ్వానం పంపారు. వీరిలో ప్రజాకవి గద్దర్, సినీ నటులు చిరంజీవి, నాగార్జున, సూపర్ స్టార్ కృష్ణ, నిర్మాత దిల్ రాజు, రిటైర్ట్ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, డి.శ్రీనివాస్, సునీతా లక్ష్మారెడ్డి, దానం నాగేందర్, కోమటిరెడ్డి బ్రదర్స్, జానారెడ్డి, దామోదర రాజనరసింహ, డీకే అరుణ, జితేందర్ తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News