CJI: సోషల్ మీడియా వార్తలకు మతం రంగు పులిమే ప్రయత్నాలు జరుగుతున్నాయి: సీజేఐ ఎన్వీ రమణ
- దేశంలో నకిలీ వార్తలు పెరిగిపోతున్నాయి
- వార్తలకు మతం రంగు పులమడం దేశానికి మంచిది కాదు
- న్యాయమూర్తులు చెపుతున్నా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పట్టించుకోవడం లేదు
దేశంలో నకిలీ వార్తలు పెరిగిపోతున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ లో కరోనా కేసులు పెరగడానికి తబ్లిగీ జమాతే సమావేశాలే కారణమంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు మతం రంగు పులిమే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇది దేశానికి మంచిది కాదని అన్నారు.
సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలు తీసుకోకపోవడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు చెపుతున్నా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పట్టించుకోవడం లేదని అన్నారు. దేశంలో శక్తిమంతమైన వ్యక్తులు చెపితేనే పట్టించుకుంటున్నాయని జస్టిస్అ రమణ సహనం వ్యక్తం చేశారు.