Polavaram Project: పోలవరం వద్ద పోటెత్తుతున్న వరద.. పలు గ్రామాలకు రాకపోకలు బంద్
- కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 30.6 మీటర్లు
- 48 గేట్లు ఎత్తివేత
- 2,05,126 క్యూసెక్కుల నీటిని వదులుతున్న అధికారులు
భారీగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోలవరం ప్రాజెక్టు వద్ద వరద నీరు పోటెత్తుతోంది. కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 30.6 మీటర్లకు చేరుకుంది. దీంతో అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్టు కిందకు విడుదల చేస్తున్నారు. 48 గేట్ల ద్వారా 2,05,126 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. గోదావరిలో నీటిమట్టం పెరగడంతో గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో గ్రామాలకు రాకపోకలు కూడా ఆగిపోయాయి. మరోవైపు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.