America: అమెరికాను కుదిపేస్తున్న భారీ వర్షాలు.. ఇబ్బందుల్లో ప్రవాసాంధ్రులు!

Heavy to Heavy rains in America 46 dead

  • అమెరికాను వణికిస్తున్న ఇడా తుపాను
  • బేస్‌మెంట్ల వరకు మునిగిన తెలుగువారి ఇళ్లు
  • న్యూయార్క్‌లో ఏకధాటిగా 9 గంటలపాటు వర్షం

ఇడా తుపాను అమెరికాను కుదిపేస్తోంది. తుపాను బారినపడి ఇప్పటి వరకు 46 మంది ప్రాణాలు కోల్పోయారు. తుపానుతో అతలాకుతలం అవుతున్న న్యూయార్క్, న్యూజెర్సీలో ఒకరిద్దరు తెలుగువారు గల్లంతైనట్టు వార్తలు వస్తున్నా ఇంకా నిర్ధారణ కాలేదు.

మరోవైపు, న్యూజెర్సీలోని మిడిలెస్సెక్స్, గ్లోసస్టర్, సోమర్‌సెట్ వంటి కౌంటీల్లోని వివిధ నగరాల్లో స్థిరపడిన తెలుగువారు భారీ వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి ఇళ్ల బేస్‌మెంట్‌లు నీటిలో మునిగాయి. అయితే, పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. చాలా వరకు రహదారులను తెరవడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.  

అయితే నదులు, కాలువలకు సమీపంలోని 20-30 శాతం రోడ్లు మాత్రం ఇంకా మూసివేసే ఉన్నాయి. మరోవైపు, భారీ వర్షాలకు న్యూయార్క్‌లోని రోడ్లను మూసివేశారు. ఇక్కడ దాదాపు 9 గంటలపాటు ఏకధాటిగా వర్షం కురవడంతో పరిస్థితి మరింత భయానకంగా మారింది.

  • Loading...

More Telugu News