Ahmad Massoud: మేం పంజ్ షీర్ లోనే ఉన్నాం... తాలిబన్లపై పోరాడుతున్నాం: అహ్మద్ మసూద్ స్పష్టీకరణ

NRF Chief Ahmad Massoud says NRF still fighting with Taliban in Panj Shir
  • పంజ్ షీర్ ను చేజిక్కించుకున్నామన్న తాలిబన్లు
  • అంతా అవాస్తవమన్న ప్రతిఘటన దళాలు
  • ఆడియో సందేశం వెలువరించిన మసూద్
  • తమ పోరాటం కొనసాగుతుందని వెల్లడి
పంజ్ షీర్ ప్రాంతం మొత్తం ఇప్పుడు తమ అధీనంలోకి వచ్చేసిందని తాలిబన్లు ప్రకటించుకున్న నేపథ్యంలో, ప్రతిఘటన దళాల అధిపతి అహ్మద్ మసూద్ స్పందించారు. తామింకా పంజ్ షీర్ లోనే ఉన్నామని, తాలిబన్లపై పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ ఆడియో సందేశం పోస్టు చేశారు.

అంతకుముందు తాలిబన్ల ప్రకటన వెలువడిన వెంటనే ప్రతిఘటన దళాల (నేషనల్ రెసిస్టెంట్ ఫ్రంట్-ఎన్ఆర్ఎఫ్) ప్రతినిధి అలీ నజారీ స్పందించారు. తమ నాయకుడు అహ్మద్ మసూద్ క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. పంజ్ షీర్ ప్రాంతం తాలిబన్ల వశమైందన్న ప్రచారంలో నిజంలేదని ఎన్ఆర్ఎఫ్ వర్గాలు స్పష్టం చేశాయి. పంజ్ షీర్ లోని అన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో తమ దళాలు కొనసాగుతున్నాయని వెల్లడించాయి.
Ahmad Massoud
Panj Shir
NRF
Taliban
Afghanistan

More Telugu News