Charan: చరణ్ .. కియారాపై శంకర్ టెస్టు షూట్!

shankar and Charan movie update

  • శంకర్ తో చరణ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్
  • నిర్మాతగా దిల్ రాజు  
  • రేపు ఘనంగా పూజా కార్యక్రమాలు
  • దసరా నుంచి రెగ్యులర్ షూటింగ్

చరణ్ .. శంకర్ కాంబినేషన్లో ఒక పాన్ ఇండియా సినిమా రూపొందనుంది. కొంతకాలంగా అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, రేపు పూజా కార్యక్రామాలను జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజున చరణ్ - కియారా అద్వానిపై శంకర్ టెస్ట్ షూట్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో చరణ్ - కియారా లుక్ ఎలా ఉండాలనే విషయంలో శంకర్ ఒక క్లారిటీకి వచ్చేశాడట. అందుకు సంబంధించిన లుక్ లో వాళ్లు ఎలా ఉండాలనే విషయంలో ఒక జడ్జిమెంట్ కి రానున్నాడని అంటున్నారు. ఈ ఇద్దరినీ కూడా మరింత కొత్తగా తెరపై చూపించనున్నాడని చెబుతున్నారు.

రేపు జరగనున్న పూజా కార్యక్రమాలకు చాలామంది సినీ ప్రముఖులు హాజరుకానున్నట్టుగా తెలుస్తోంది. దసరా నుంచి రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమాపై, అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News