Puri Jagannadh: పూరీ జగన్నాథ్, తరుణ్ లకు ఊరట... వారి శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేవన్న ఎఫ్ఎస్ఎల్
- పూరీ జగన్నాథ్, తరుణ్, తదితరులపై డ్రగ్స్ కేసు
- 2017లో శాంపిల్స్ సేకరణ
- రక్తం, గోళ్లు, వెంట్రుకలు పరీక్షించిన ఫోరెన్సిక్ ల్యాబ్
- గతేడాది నివేదిక సమర్పణ
- చార్జిషీటులో వివరాలు పొందుపరిచిన ఎక్సైజ్ శాఖ
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో తరుణ్ ల శాంపిల్స్ లో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) స్పష్టం చేసింది. పూరీ జగన్నాథ్, తరుణ్ ల నుంచి 2017లో తెలంగాణ ఎక్సైజ్ శాఖ రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించింది. వాటిని పరీక్షించిన ఎఫ్ఎస్ఎల్ నివేదిక రూపొందించింది.
ఈ నివేదికను 2020 డిసెంబరు 8న రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు సమర్పించారు. డ్రగ్స్ సరఫరాదారుగా భావిస్తున్న కెల్విన్ పై చార్జిషీటులో ఈ మేరకు ఎక్సైజ్ శాఖ వివరాలు వెల్లడించింది. దీనిపై ఎఫ్ఎస్ఎల్ ఏడీ వాంగ్మూలాన్ని కూడా ఎక్సైజ్ శాఖ కోర్టుకు సమర్పించింది.