Sensex: యూరోపియన్ మార్కెట్ల అండతో భారీ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
- 514 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 165 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 5 శాతం వరకు లాభపడ్డ బజాజ్ ఫైనాన్స్
రెండు రోజుల వరుస నష్టాలకు దేశీయ స్టాక్ మార్కెట్లు ముగింపు పలికాయి. ఈరోజు మార్కెట్లు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. దిగ్గజ కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిన్ తదితర కంపెనీలు మార్కెట్లను నడిపించాయి.
ఓపక్క ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉండటంతో మన మార్కెట్లు మధ్యాహ్నం వరకు నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. అయితే, యూరోపియన్ మార్కెట్లు పాజిటివ్ గా ప్రారంభం కావడంతో దాని ప్రభావం మన మార్కెట్లపై పడింది. దీంతో మన మార్కెట్లు లాభాల్లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 514 పాయింట్లు లాభపడి 59,005కి ఎగబాకింది. నిఫ్టీ 165 పాయింట్లు పుంజుకుని 17,562 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (4.94%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.29%), ఐటీసీ (3.36%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.18%), టాటా స్టీల్ (3.08%).
టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-2.54%), బజాజ్ ఆటో (-1.20%), నెస్లే ఇండియా (-0.83%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.61%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.42%).